29 ఆగస్టు 2022

తెలుగు భాష

 

 జన్మదినం తెలుగు తల్లి జన్మదినం,

 ప్రభాత కిరణమై నన్నయ్య ఒడిలో పురుడోసుకుంది నా తెలుగు

ఆదిపర్వంతో అన్నప్రాసనమై అరణ్యపర్వం లో అడుగులు నేర్చింది నా తెలుగు,

 పోతన భాగవతం అవపోసన పట్టింది ,

భువన విజయంలో కొలువుతీరి కూర్చుంది ,

ప్రసవ వేదన పడ్డ తెలుగు తల్లి తాళ్ళపాక వారింట తెలుగు పదానికి జన్మమిచ్చింది,

 కాలం గిర్రున తిరిగింది భాష  వేగంగా పరిగెత్తింది,

 ప్రక్రియలెన్నో ఆభరణాలుగా అలంకరించుకుంది,

 అంతలో ఎచట నుంచి వచ్చిందో పరభాషా పురుగొకటి తలచి తలచి భాషను కబళించి వేసింది

                     కానీ

 కాలంలో కారు మబ్బులు విడిపోయాయి,

 ఎన్ని భాషలు వచ్చినా ఎన్ని పోకడలొచ్చినా మధుర భాష మనుగడపై మచ్చుకైనా మచ్చ ఉండదు. 

ఎందుకంటే 

మధురం నా తెలుగు 

అమరం నా తెలుగు

 అజంతం నా తెలుగు 

అద్భుతం నా తెలుగు 

అనంతం నా తెలుగు

 అమృతం నా తెలుగు

 కథామృతం నా తెలుగు రసామృతం నా తెలుగు

 కోయిల పాట నా తెలుగు కమ్మనైన అమ్మ జోల పాట నా తెలుగు .

ఆవకాయ ఘాటు నా తెలుగు గోంగూర వేటు నా తెలుగు 

పద్యపు పరిమళం నా తెలుగు  చీరకట్టు అందం నా తెలుగు 

నా ఆట తెలుగు

 నా పాట తెలుగు 

నా వేషం తెలుగు

 నా దేశం తెలుగు 

నా పదం తెలుగు 

నా పద్యం తెలుగు 

నా జీవితం తెలుగు 

నా జీవనం తెలుగు,

నా ఆహార్యం తెలుగు,

నా పొగరు తెలుగు 

తెలుగంటే కాదు 56 అక్షరాల ఆట 

ఇది మా జీవిత నిర్దేశ , గమ్యాల బాట 

తెలుగు మా ఆభరణం 

తెలుగుకు లేదు మరణం 

జై తెలుగు తల్లి ..

         ఇట్లు 

       మీ తెలుగు బిడ్డ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగు భాష

    జన్మదినం తెలుగు తల్లి జన్మదినం,  ప్రభాత కిరణమై నన్నయ్య ఒడిలో పురుడోసుకుంది నా  తెలుగు ,  ఆదిపర్వంతో అన్నప్రాసనమై అరణ్యపర్వం లో అడుగులు న...