23 మే 2021

నా కవిత్వం

      నా కవిత్వం     

నా కవిత్వం కాదొక తత్వం

మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం 

కాదయ్యా అయోమయం, జరామయం.


గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ

జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

-దేవరకొండ బాల గంగాధర తిలక్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగు భాష

    జన్మదినం తెలుగు తల్లి జన్మదినం,  ప్రభాత కిరణమై నన్నయ్య ఒడిలో పురుడోసుకుంది నా  తెలుగు ,  ఆదిపర్వంతో అన్నప్రాసనమై అరణ్యపర్వం లో అడుగులు న...