29 ఆగస్టు 2022

తెలుగు భాష

 

 జన్మదినం తెలుగు తల్లి జన్మదినం,

 ప్రభాత కిరణమై నన్నయ్య ఒడిలో పురుడోసుకుంది నా తెలుగు

ఆదిపర్వంతో అన్నప్రాసనమై అరణ్యపర్వం లో అడుగులు నేర్చింది నా తెలుగు,

 పోతన భాగవతం అవపోసన పట్టింది ,

భువన విజయంలో కొలువుతీరి కూర్చుంది ,

ప్రసవ వేదన పడ్డ తెలుగు తల్లి తాళ్ళపాక వారింట తెలుగు పదానికి జన్మమిచ్చింది,

 కాలం గిర్రున తిరిగింది భాష  వేగంగా పరిగెత్తింది,

 ప్రక్రియలెన్నో ఆభరణాలుగా అలంకరించుకుంది,

 అంతలో ఎచట నుంచి వచ్చిందో పరభాషా పురుగొకటి తలచి తలచి భాషను కబళించి వేసింది

                     కానీ

 కాలంలో కారు మబ్బులు విడిపోయాయి,

 ఎన్ని భాషలు వచ్చినా ఎన్ని పోకడలొచ్చినా మధుర భాష మనుగడపై మచ్చుకైనా మచ్చ ఉండదు. 

ఎందుకంటే 

మధురం నా తెలుగు 

అమరం నా తెలుగు

 అజంతం నా తెలుగు 

అద్భుతం నా తెలుగు 

అనంతం నా తెలుగు

 అమృతం నా తెలుగు

 కథామృతం నా తెలుగు రసామృతం నా తెలుగు

 కోయిల పాట నా తెలుగు కమ్మనైన అమ్మ జోల పాట నా తెలుగు .

ఆవకాయ ఘాటు నా తెలుగు గోంగూర వేటు నా తెలుగు 

పద్యపు పరిమళం నా తెలుగు  చీరకట్టు అందం నా తెలుగు 

నా ఆట తెలుగు

 నా పాట తెలుగు 

నా వేషం తెలుగు

 నా దేశం తెలుగు 

నా పదం తెలుగు 

నా పద్యం తెలుగు 

నా జీవితం తెలుగు 

నా జీవనం తెలుగు,

నా ఆహార్యం తెలుగు,

నా పొగరు తెలుగు 

తెలుగంటే కాదు 56 అక్షరాల ఆట 

ఇది మా జీవిత నిర్దేశ , గమ్యాల బాట 

తెలుగు మా ఆభరణం 

తెలుగుకు లేదు మరణం 

జై తెలుగు తల్లి ..

         ఇట్లు 

       మీ తెలుగు బిడ్డ...

12 ఫిబ్రవరి 2022

rrr movie - expectations

 RRR మూవీ ఎలా ఉండబోతుంది?


                     సినిమా ప్రపంచంలో  మనసుకి అందనంత ఊహా  ఉంటుందంటారు. కానీ మన రాజమౌళి కథలు మాత్రం నిజానికి పెద్దపీట వేసినట్లు మాటలుంటాయి. రణం -రౌద్రం - రుధిరం(RRR) ఇప్పటికే  ముగ్గురు యువ నాయకులతో కలిసి మల్టీస్టారర్ మరియు పాన్ ఇండియా సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. rrr  ట్రైలర్ చూసినా, పాటలు విన్న  ప్రేక్షకులలో ఎన్నో  ఊహాగానాలు మొదలయ్యాయి. 


RRR(రణం -రౌద్రం - రుధిరం)

1)  RRR  లోని ముఖ్య ఘట్టాలు:-    

                 ఇది స్వాతంత్రోద్యమ కాలాన్ని ఆధారంగా చేసుకుని కల్పించిన కథ. అంటే స్వేచ్ఛ, సమానత్వం, వ్యాపార సంబంధాలు, వర్తకకారుల పన్ను బెదిరింపులకు, అడవితల్లి అంచున కల్లాకపటం లేకుండా బ్రతికే కొండజాతుల కనువిప్పుకు, అనాది నుండి నేటివరకు సాంకేతికత పేరుతో సమాజపు భూటకన్యాయాలు, భూస్వాముల బలపన్నాగాలను ఓర్చి - ఎదిరించి, నమ్మిన సిద్ధాంతానికి  ప్రాణాలను -  మానాలను, ప్రాణులను అర్పించి, ఎంతటి ఘాతుకానికి అయినా వెనకాడకుండా యుద్ధం వస్తే, వెనుతిరిగి చూడకుండా రొమ్ము కింద ఉండే గుండె - కండ బలాన్ని  ఫిరంగి గుండ్లకి చూపిస్తూ చివరికి అంతిమము కాని ప్రజలకి - ప్రశ్నలకి ప్రతిరూపమైన కథ ఈ RRR.


2) RRR లోని భావాలు:-  

                    1--> కథలోని భావాలు  కర్కశానికి - కనికరానికి మధ్య నలిగేవిగా ఉంటాయి. ముఖ్యంగా నిజమైన స్నేహానికి ఉన్న విలువలను ఈ సినిమా మరల మన కళ్లముందు ఉంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రాణ స్నేహితుడు అన్న పదాన్ని మనకి మరల పరిమలంగా ప్రకటించి కన్నీరుని సైతం తెప్పిస్తుంది.


             2--> కుల, మత,  వర్ణ, వర్గ  విభేదాలకు తావు లేకుండా , మనిషిలోని మానవత్వపు విలువలని వెలికితీసే భావంతో మనకి సందేశమిస్తుంది. ఈ భావం అప్పటి స్వాతంత్ర ఉద్యమకారులకైతే గతస్మృతులతో కట్టిపడేస్తుంది.


            3--> గృహిణిగా ఉండవలసిన స్త్రీ పాత్ర చిన్నప్పటి నుండి అడవితల్లి నుండి వేరుపడి ఎన్ని బాధలు - భయాలు అనుభవించిందో గుర్తుచేసి అసలైన స్వేచ్ఛ - సమానత్వాలను స్పురింపజేస్తుంది.  

               పైన చెప్పిన ఈ మూడు భావాలు RRR లోని నటి- నటులకు, అప్పటి వీరులకు వర్తించేవిగా ఉన్నాయి. ఇంకా ప్రేక్షకుడి భావ కోణం కూడా మిగిలే ఉంది. ఈ సినిమా RRR రిలీజ్ అయ్యాక అది తెలుస్తుంది.


 


 < 3) RRR లోని ప్రత్యేకతలు:-


                        ఈ సినిమాలోని కథ మొత్తం  ఇద్దరు విప్లవకారులైనటువంటి అల్లూరి సీతారామరాజు  మరియు కొమరం భీమ్ లాంటి ప్రఖ్యాత వ్యక్తులని గూర్చి చెప్పే కథ. వీరిద్దరూ కూడా బ్రిటీషు మరియు నైజాం పాలనకు వ్యతిరేకముగా  పోరాడినవారు. 


 ఇది పూర్తిగా తెలుగు వీరుల మరియు తెలుగు ప్రాంత ప్రజలను గూర్చి ప్రపంచానికి తెలియచేసే కథ. అంటే మరొకమారు సినీ ప్రపంచంలో నున్న తెలుగనేడి కీర్తి పతాకం రెపరెప లాడుతుందన్నమాట. 



4) RRR కి వచ్చే వసూళ్ళ  పర్వమెంత?


                ప్రతి సినిమా విజయవంతం అయిందనేది ఇది వరకు ఎక్కువ మందికి చేరువైతే ఆ గుర్తింపు దక్కేది. కానీ నేటి కమర్షియల్ మరియు పోటాపోటీ ప్రపంచంలో ఎంత ఎక్కువ కలెక్షన్లు, షోలు, ఎన్ని థియేటర్లు,  పాన్  ఇండియా లాంటి భారీ గుర్తింపును పొందటం  వంటి లెక్కలు వచ్చాయి. 


              అయినప్పటికి కూడా RRR  ఇప్పటికే సుమారు 1000,0000,000 కోట్ల రూపాయల భారీ బుకింగ్స్ ,pvrrr లాంటి డీలర్ షిప్లలను పొందినది అని వార్తలున్నాయి.   


5) RRR లో ఇప్పటికే జనాదరణ పొందినవి:-

    
            RRR  ట్రైలర్(trailer) ఇప్పటికే సినిమా మీద ఒక రేంజ్లో ఊహాగానాలను మరియు ఆసక్తిని రేపింది. రామ్ చరణ్ మరియు తారక్ రామ్ మధ్య ఏర్పరిచిన దోస్తీ అనే స్నేహాగీతం కుర్రకారుని కట్టిపడేస్తుంది. నిజమైన స్నేహానికి ప్రతిరూపం ఈ పాట అన్న అంచనా వేస్తున్నారు. 


                        కొండ జాతుల స్త్రీ విలువలని, సంప్రదాయాలని గొప్పగా చూపించే స్క్రీన్ ప్లే ఉంటుందని ఆశిస్తున్నారు.  ముంబై, చెన్నై లాంటి మహానగరాల్లో ఇప్పటికే ప్రిరిలీజ్  ఈవెంట్ చేసిన RRR  టీమ్ మరి హైదరాబాద్ లాంటి భాగ్యనగరంలో ఎప్పుడు పెడతారా అని అభిమానులు, ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు.


6) RRR  యూత్ ని  ఎలా ప్రభావితం చేస్తుంది:-

            యూత్ ఎప్పుడు అనుసరించడానికి ఏదో ఒక చిన్న అంశం దొరకపోదా అని చూస్తుంటారు. అది అభిమాని అయినా ప్రేక్షకుడు అయినా, ఇందులో విప్లవకారుల యొక్క భావాలను లేదా నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను గూర్చి గ్రహించి వాటిని  పొందటంలోని  ఘట్టాలను - త్యాగాలను గుర్తించి ప్రేరణని  పొందుతారు. ఒక మన్యం వీరుడు, ఒక కొమరం భీమ్  మాకు ఆదర్శం అనేలా ప్రభావముంటుంది.


7) RRR  వెలుగులోకి తెచ్చిన  కొండజాతుల సంప్రదాయం:-

                అడవి తల్లి ఒడిలో సామాజికత - సాంకేతికత లేని చోట వాళ్ళకంటూ ప్రత్యేకమైన విధానాన్ని ఒడంబడికను అవలంబించే కొండ జాతులు, కోయ దొరలు, తెగలు  మొదలగు జనుల జీవన సంప్రదాయాలను వెలికితీసిన చిత్రం అవ్వాలని అనుకుందాము. 


                                 <అభివృద్ధి చెందిన నగరాలు, రాష్ట్రాలలోని మహిళలకు - స్త్రీలకు ఈ సినిమా ఒక సందేశం కావాలని ఆశిద్దాము. ఎందువలననగా ఆదిమానవ కాలం నుండి నేటివరకు ఉన్న వ్యవస్థలన్ని కూడా ఆనాటి మాతృస్వామ్య వ్యవస్థ నుండే  అవిర్భివించనవి. అందుకే స్త్రీలు వారి ప్రాముఖ్యతను - ప్రత్యేకతను ఈ చిత్రంలోని  పాత్రల ద్వారా వారికి అర్థమయ్యేలా - అద్దం పట్టేలా ఉండాలని  భావిస్తున్నాం.


8) RRR ని  కూడా నిషేదించటం (ban) లాంటివి చేస్తారా:-

                     సెన్సార్ బోర్డ్ పర్మిషన్ అన్ని తీసుకున్నాక ( rrr movie release date) జనవరి 7న విడుదల చేద్దామనే అనుకున్న డైరెక్టర్ రాజమౌళిగారికి  ఈ ఒమిక్రాన్ కష్ట కాలం ఎదురయ్యింది. అంతేకాక ఈ విప్లవ కారుల కథ, పక్కన పెడితే ఆ మధ్యన మనందరికీ గుర్తున్న విషయం ముస్లిం సోదరుల వాదన గూర్చి తెలిసిందే... 

 

                వాళ్ళ  మనోభావాలు దెబ్బతినకుండా ఆహార్యం ఉండాలనేది వారి అబిమతంగా చెప్పడం జరిగింది. దానికి కావలసిన మార్పులు - చేర్పులు కోర్టు కోటలలో కూడా కొట్టివేయడం జరిగింది. కావున ఈ సినిమాకి ఇక ఎలాంటి నిషేధాలు ఉండకూడదని కోరుకుందాం....


9) RRR ని  చూసి తెలుగోడిగా ఎందుకు గర్వపడాలి?


                         తెలుగు ప్రాంతీయ వాసులైన ఇద్దరు విప్లవకారులు అల్లూరి సీతారామరాజు  మరియు కొమరం భీమ్  లాంటి ప్రఖ్యాతమైన వ్యక్తులని గూర్చి చెప్పే కథ. కావున ఇది తెలుగోడి యొక్క ఘనతను, దైర్యాన్ని, తేజస్సుని  తెలిపేదిగా ఉంటుంది. అంతేకాకుండా పూర్తిగా మన తెలుగు వారి కట్టుబాట్లు, పరిస్థితులను, సంప్రదాయాలకు ప్రతీకగా నిలబడి యావత్తు ప్రపంచానికి చాటి చెప్తుంది.


10) RRR  ఎలాంటి విజయాన్ని  సాధిస్తుంది?

                సినిమా మాటల్లో విజయం అంటే అవార్డులు, రివార్డులు, వంటివి ఏదైనా అవ్వవచ్చు. కానీ ప్రజల దృష్టిలో ఇదొక వాస్తవమైన దృశ్యకావ్యంగా భావితరాలకు గుర్తుండిపోతుంది. ముఖ్యంగా ఆయా విప్లవకారుల ప్రాంత ప్రజలకు మాత్రం ఇది కళ్ళకు కట్టిన కథ. కావున వాళ్ళ  దృష్టిలో ఎంతటి విజయాన్ని పొందుతుందో చూడాలి.

23 మే 2021

నా కవిత్వం

      నా కవిత్వం     

నా కవిత్వం కాదొక తత్వం

మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం 

కాదయ్యా అయోమయం, జరామయం.


గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ

జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.

అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల ధగద్ధగ రవాలు

నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు.

-దేవరకొండ బాల గంగాధర తిలక్.

19 మార్చి 2021

అందుకో నా పగిలిన హృదయం/Andhuko naa pagilina hrudayam

 

          👉 అందుకో నా పగిలిన హృదయం 💔

"ఎదురుచూపులు చివరిచూపులై ఎదురైనవేమో ఎదకి"
చివరిచూపులే ఎదురుచూపులై విరిసెను కలలకి,
కలహాల భావాలు కలహించి ఎదలోన చితికి
చివరి మజిలిగా పయనించెను చితికి..


💧💧రాలే కన్నీటిని వడిసి పట్టుకున్నాను
నీకు కనిపిస్తే బాధపడతావని
రగిలే గుండె ఘోషని గొంతులోనే బంధించాను
           నీకు తెలిస్తే తట్టుకోలేవని..
మరి నీకోసం ఇన్ని చేసిన నన్నెందుకు
           
కటిక చీకటిలో వదిలేసి వెళ్ళావు..
కన్నీటి సంద్రంలో ముంచేసి పోయావు
..

ఓ నా మనో సమాధిలో నిదురపోతున్న నా ఒంటరితనమా రా..
ఇదిగో కుళ్ళిన బంధాల చితులపై నుండి నిన్ను పిలుస్తున్న రా..
భావాల మోసాలకు బలైన మనసు బాధ నుండి నిన్ను ఆహ్వానిస్తున్న రా..
కరిగిపోయిన ప్రేమలా ఏమి చెప్పిన అర్ధం చేసుకోలేని వెర్రితనపు ఛాయలా నిన్ను పిలుస్తూనే ఉన్నా రా..

 మూగబోయిన నా మనోస్వరాల మధ్య

నా✏ కలం నోరు విప్పుతోంది..

కళలు కలలు కాదని కడతేరని పయనపు మార్గాలని,
కల్ల కాని కల్లోలాలు చెలరేగిన కదలని కథలని,

        సిరల నెత్తురును శిశిరమను సిరా చుక్కన నిలిపిన చక్కని చిక్కని మాధుర్యం,

చిక్కక చుక్కల చాటున నక్కిన చక్కనయ్యలా నాలో అంతుచిక్కని "చిక్కని" భావాల వాలు పాలువోలుతున్నాయి.


ఆ క్షణం నా ఏకాంతం మనసుతో రమిస్తోంది..
కన్నీళ్ల వీర్యాన్ని కళ్ల గర్భంలో వొదిలింది..
మనసు నెల తప్పింది..

 క్షణ కాలపు భావాల భారాన్ని నవమాసాలుగా మోసి అందమైన ప్రేమకు జన్మనిచ్చింది..
ఆ ప్రేమ కాలం ఒడిలో ఆడుకుంటూ జ్ఞాపకాలను చదువుకుంటూ అగదిలో చెన్నునై ఆశాశ్వతానికి పయనం సాగించింది.
నేను మాత్రం నన్ను చేరని ఆ ప్రేమకోసం వేచిచూస్తూనే ఉన్నా..
‌ఓ ప్రేమా జగమంత కుటుంబంలో ఒంటరిగా నిలబడి ఈ అశ్రునయనాల సాక్షిగా 
నిన్ను ఆవాహన చేస్తున్న 
రా అందుకో నా పగిలిన హృదయం💔💫💔💫..

03 ఫిబ్రవరి 2021

నా భావాలు

 విలువివ్వని మనుషులకై

 అర్ధాలు అపార్ధాలు ఆకలిని పెంచుతాయి. 

నానార్ధాలు నానారకాలుగా మారతాయి. 

పర్యాయపదాలు పర్యవసానాలు పర్యవేక్షిస్తాయి. 

సంధులు ఒక్కటిగా కలుపుతూనే వేరుచేసేస్తాయి.

సమాసాలు వేరు చేసే వ్యసనాలు.

 వ్యుత్పత్తులు  ఉట్టి పాలపొంగులు

అర్ధంచేసుకోగలిగితే వ్యాకరణంలో జీవితం ప్రతిబింబిస్తుంది.

జీవితం ఒక వ్యాక(కా)రణమే.

💐💐✊🏻SVS✊🏻💐💐

తెలుగు భాష

    జన్మదినం తెలుగు తల్లి జన్మదినం,  ప్రభాత కిరణమై నన్నయ్య ఒడిలో పురుడోసుకుంది నా  తెలుగు ,  ఆదిపర్వంతో అన్నప్రాసనమై అరణ్యపర్వం లో అడుగులు న...