19 మార్చి 2021

అందుకో నా పగిలిన హృదయం/Andhuko naa pagilina hrudayam

 

          👉 అందుకో నా పగిలిన హృదయం 💔

"ఎదురుచూపులు చివరిచూపులై ఎదురైనవేమో ఎదకి"
చివరిచూపులే ఎదురుచూపులై విరిసెను కలలకి,
కలహాల భావాలు కలహించి ఎదలోన చితికి
చివరి మజిలిగా పయనించెను చితికి..


💧💧రాలే కన్నీటిని వడిసి పట్టుకున్నాను
నీకు కనిపిస్తే బాధపడతావని
రగిలే గుండె ఘోషని గొంతులోనే బంధించాను
           నీకు తెలిస్తే తట్టుకోలేవని..
మరి నీకోసం ఇన్ని చేసిన నన్నెందుకు
           
కటిక చీకటిలో వదిలేసి వెళ్ళావు..
కన్నీటి సంద్రంలో ముంచేసి పోయావు
..

ఓ నా మనో సమాధిలో నిదురపోతున్న నా ఒంటరితనమా రా..
ఇదిగో కుళ్ళిన బంధాల చితులపై నుండి నిన్ను పిలుస్తున్న రా..
భావాల మోసాలకు బలైన మనసు బాధ నుండి నిన్ను ఆహ్వానిస్తున్న రా..
కరిగిపోయిన ప్రేమలా ఏమి చెప్పిన అర్ధం చేసుకోలేని వెర్రితనపు ఛాయలా నిన్ను పిలుస్తూనే ఉన్నా రా..

 మూగబోయిన నా మనోస్వరాల మధ్య

నా✏ కలం నోరు విప్పుతోంది..

కళలు కలలు కాదని కడతేరని పయనపు మార్గాలని,
కల్ల కాని కల్లోలాలు చెలరేగిన కదలని కథలని,

        సిరల నెత్తురును శిశిరమను సిరా చుక్కన నిలిపిన చక్కని చిక్కని మాధుర్యం,

చిక్కక చుక్కల చాటున నక్కిన చక్కనయ్యలా నాలో అంతుచిక్కని "చిక్కని" భావాల వాలు పాలువోలుతున్నాయి.


ఆ క్షణం నా ఏకాంతం మనసుతో రమిస్తోంది..
కన్నీళ్ల వీర్యాన్ని కళ్ల గర్భంలో వొదిలింది..
మనసు నెల తప్పింది..

 క్షణ కాలపు భావాల భారాన్ని నవమాసాలుగా మోసి అందమైన ప్రేమకు జన్మనిచ్చింది..
ఆ ప్రేమ కాలం ఒడిలో ఆడుకుంటూ జ్ఞాపకాలను చదువుకుంటూ అగదిలో చెన్నునై ఆశాశ్వతానికి పయనం సాగించింది.
నేను మాత్రం నన్ను చేరని ఆ ప్రేమకోసం వేచిచూస్తూనే ఉన్నా..
‌ఓ ప్రేమా జగమంత కుటుంబంలో ఒంటరిగా నిలబడి ఈ అశ్రునయనాల సాక్షిగా 
నిన్ను ఆవాహన చేస్తున్న 
రా అందుకో నా పగిలిన హృదయం💔💫💔💫..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగు భాష

    జన్మదినం తెలుగు తల్లి జన్మదినం,  ప్రభాత కిరణమై నన్నయ్య ఒడిలో పురుడోసుకుంది నా  తెలుగు ,  ఆదిపర్వంతో అన్నప్రాసనమై అరణ్యపర్వం లో అడుగులు న...